A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు బురద చల్లుతున్నారు-జగన్
Share |
January 26 2022, 4:24 pm

ఆ పెద్ద మునిషివి బురద రాజకీయాలు అని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. మీడియా ఆ వివరాలు వచ్చాయి. అవి ఇలా ఉన్నాయి..
►వరద బాధిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు ఇంతటి శరవేంగా చర్యలను తీసుకోవడం అన్నది గతంలో ఎన్నడూ జరగలేదు. గతంలో కనీసం నెల పట్టేది.
►ఇప్పుడు వారంరోజుల్లోనే బాధితులకు సహాయాన్ని అందించగలిగారు.
► బాధిత కుటుంబాలకు అన్నిరకాలుగా నష్టపరిహారాన్ని అందించాం.
►గతంలో ఇల్లు ధ్వంసమైతే పరిహారం అందడానికి నెలరోజులు పట్టేది.
►దురదృష్టవశాత్తూ ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటే నెలరోజులు పట్టేది.
►గల్లైంతైన వారికి ఎలాంటి పరిహారం ఇచ్చేవారు కాదు.
►అలాంటిది ఇవాళ వారంరోజుల్లో ఆయా కుటుంబాలకు పరిహారం ఇచ్చి వారిని అదుకున్నారు.
►గతంలో రేషన్, నిత్యావసరాలు ఇస్తే చాలు అనుకునేవాళ్లు.
►మనం వీటిని ఇవ్వడమే కాకుండా రూ.2వేల రూపాయలు అదనపు సహాయం కూడా ఇచ్చాం.
►గతంలో ఎప్పుడూ కూడా ఇలా చేయలేదు.
►సీజన్‌ ముగిసేలోగా నష్టపోయిన రైతులకు సహాయం చేసిన దాఖలాలు లేవు.
►ఇప్పుడు నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్‌ పూర్తిచేసి.. సీజన్‌లోగా వారికి సహాయం అందిస్తున్నాం.
►గతంలో ఇన్‌పుట్‌సబ్సిడీ అందాలంటే కనీసం సంవత్సరం పట్టేది. ఆతర్వాత కూడా ఇచ్చిన దాఖలాలు లేవు.
►ఇవాళ పంట నష్టపోయిన సీజన్‌ ముగిసేలోగానే మనం అందిస్తున్నాం.
►రూ.6వేల కోట్లు నష్టం జరిగితే ... ఇచ్చింది రూ.34 కోట్లే అని విమర్శలు చేస్తున్నారు.
►జరిగిన నష్టంలో 40శాతం రోడ్లు రూపేణా, 30శాతానికిపైగా పంటరూపేణా, సుమారు 18శాతం ప్రాజెక్టులకు జరిగిన నష్టం రూపేణా జరిగింది.
►హుద్‌హుద్‌లో రూ.22వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పారు.. ఇచ్చింది రూ.550 కోట్లు.
►అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది.
►రూ.22వేల కోట్లు నష్టం వచ్చిందని చెప్పిన పెద్ద మనిషి ఇచ్చింది రూ.550 కోట్లు.
►కలెక్టర్లు, అధికారులు బాగా పనిచేసి పరిహారాన్ని ఇంతవేగంగా అందిస్తే.. దానిపైన కూడా బురద జల్లుతున్నారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info