A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు విమర్శలు
Share |
January 26 2022, 4:30 pm

ముఖ్యమంత్రి జగన్ ఆద్వర్యంలోని అధికార బృందం వరద బాదిత ప్రాంతాలలో బాగా పనిచేసిందని కేంద్ర బృందం ప్రశంసించిన రోజునే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు యధా ప్రకారం విమర్శలు చేశారు. వరద బాదితులను ఆదుకోవడంలో విఫలం అయిందని, ప్రకృతి వైపరీత్యాల నిధి 1100 కోట్ల ను దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. వరదలలో జరిగిన మరణాలు మానవ తప్పిదాలేనని ఆయన అన్నారు. డ్వాక్రా మహిళల నిదులు కూడా ప్రభుత్వం వాడుకుందని ఆయన అన్నారు. హౌసింగ్ బోర్డు గతంలో కేటాయించిన ఇళ్లను రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం డబ్బు వసూలు చేస్తోందని , తాము అదికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా ప్రభుత్వ అప్పులతో ఎపి బ్రాండ్ ఇమేజీ దెబ్బతింటోందని ఆయన విమర్శించారు.

tags : chandrab

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info