A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ స్థానాన్ని టి.ఎమ్.సి ఆక్రమిస్తుందా
Share |
January 26 2022, 4:56 pm

కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఆక్రమించాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలలో విస్తరిస్తూ, కాంగ్రెస్ నేతలను కలుపుకుంటున్న ఈ పార్టీ పార్లమెంటులో కూడా కాంగ్రెస్ తో సమన్వయం చేసుకోబోమని చెప్పడం విశేషం.పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్‌ పార్టీతో సమన్వయం చేసుకోవడంపై తమకు ఆసక్తి లేదని , ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఇతర పక్షాలకు సహకారం అందిస్తామని వెల్లడించింది. కాంగ్రెస్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఈ నెల 29న నిర్వహించనున్న ప్రతిపక్షాల భేటీకి తాము హాజరుకాబోమని పేరు వెల్లడించడానికి ఇష్టపడని టీఎంసీ సీనియర్‌ నాయకుడొకరు చెప్పారని క ధనం. అధికార బీజేపీని ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్‌ నేతల్లో అంకితభావం కనిపించడం లేదని తప్పుపట్టారు.

tags : tmc

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info