A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డాలర్ శేషాద్రి ఇక లేరు
Share |
January 26 2022, 5:08 pm

తిరుమల శ్రీవెంకటేశ్వరుడి ఆలయ దర్శనానికి ఏ ప్రముఖుడు వచ్చినా , వారి పక్కన కనిపించే డాలర్ శేషాద్రి ఇక లేరు. విశాఖపట్నంలో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఆలయ ప్రత్యేకాదికారిగా ఆయన పద్నాలుగేళ్లుగా కొనసాగుతున్నారు. 2007లో ఆయన రిటైర్ అయినా, ఇప్పటికీ ప్రత్యేకాధికారిగా ఉన్నారంటేనే ఆయన విశిష్టత తెలుస్తుది. ఏ ప్రభుత్వం వచ్చినా ఆయనను మార్చలేదు. కార్తీక దిపోత్సవం కార్యక్రమానికి ఆయన విశాఖ వెళ్లారు.
డాలర్ శేషాద్రి మరణం బాధాకరమని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాలర్ శేషాద్రి మరణం టీటీడీకి తీరని లోటని అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. డాలర్ శేషాద్రి ధన్యజీవి అని మాజీ సిఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం అన్నారు. ఆయనతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.

tags : ap, dollar sheshadri

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info