A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పేషంట్ కు ,డాక్టర్ కు గుండెపోటు
Share |
January 26 2022, 5:06 pm

ఇది అరుదైన ఘటనే. గుండెపోటు వచ్చిందని ఒక ఆస్పత్రికి రోగిని తీసుకు వస్తే, అతనికి వైద్యం చేస్తున్న డాక్టర్ కూడా గుండెపోటుకు గురయ్యారన్న వార్త బాధ కలిగించేదే. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జల్ తండాకు చెందిన వ్యక్తికి ఉదయం గుండెపోటు రావడంతో గాంధారి మండలంలోని ఎస్వీ శ్రీజ మల్లి స్పెషలిస్ట్ ఆసుపత్రికి వారి బంధువులు తీసుకొచ్చారు. పేషేంట్‌కు ట్రీట్మెంట్ చేస్తుండగా డాక్టర్‌ లక్ష్మణ్‌కు కూడా గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పేషేంట్‌కి మెరుగైన వైద్యం కోసం కామారెడ్డికి తరలిస్తుండగా మధ్యమార్గంలో రోగి కూడా మృతి చెందారు.

tags : heart attack

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info