A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో బిజెపిది డేంజరస్ గేమా!
Share |
January 26 2022, 5:30 pm

తెలంగాణ లో బిజెపి డేంజరస్ గేమ్ ఆడుతూ రైతులను సమస్యలకు గురి చేస్తోందని నమస్తే తెలంగాణ పత్రిక కధనం ఇచ్చింది. యాసంగి పంట కొనుగోలకు సంబంధించి కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను తెలంగాణ మంత్రుల బృందం కలిసినప్పుడు ఆయన తాము రాజకీయ నేతలమేనని, తమకు రాజకీయాలు ఉంటాయని అన్నారట. రైతుల ధాన్యం కొనుగోలులో రాజకీయం ఏమిటని బిజెపిది డేంజరస్ గేమ్ అని ఈ పత్రిక వ్యాఖ్యానించింది. మరో వైపు
తెలంగాణ నుంచి పారాబాయిల్డ్‌ (ఉప్పుడు) బియ్యం సేకరించబోమని భారత ఆహార సంస్థ నిర్ణయించినందున రాష్ట్ర రైతులు వరి సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో యాసంగి సీజన్‌లో పండే వరి ఉప్పుడు బియ్యానికే అనుకూలమైందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డితో కలసి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

tags : telangana, bjp, danger gane

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info