A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేరళలో కూలీ రేటు 706 రూపాయలు
Share |
January 26 2022, 5:42 pm

కేరళలో వ్యవసాయ కూలీల దినసరి వేతనం ప్రస్తుతం 706 రూపాయలుగా ఉందట. ఆర్బిఐ రూపొందించిన నివేదికలో ఈ సంగతి తెలిపారు. ఆ తర్వాత ఎపిలో 318 రూపాయలు, కర్నాటకలో 312 రూపాయలుగా ఉంది. అలాగే గ్రామీణ రంగం నిర్మాణ కూలీలకు కేరళలో 830 రూపాయలు లభిస్తోంది. దేశంలో ఎక్కడా ఇంత పెద్ద ఎత్తున వేతనం లభించడం లేదు. కర్నాటకలో 365 రూపాయలు, ఎపిలో 353 రూపాయలు దక్కుతోంది. వ్యవసాయేతర కూలీలకు లభించే వేతనంలో ఊడా కేరళనే ముందంజలో ఉంది. అక్కడ 677 రూపాయలు కాగా, ఎపిలో 305 రూపాయలు ఉంది.గుజరాత్ రాష్ట్రం ఈ వేతనాల విషయంలో అన్ని రాష్ట్రాలకన్నా అత్పల్లంగా ఉంది. ఎపిలో గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వ్యవసాయ కూలీల రోజువారీ వేతనం రూ.300లోపే ఉంటే 2019–20 నుంచి ఇది రూ.300 దాటింది. అలాగే, వ్యవసాయేతర కూలీల రోజు వారీ వేతనం కూడా చంద్రబాబు హయాంలో రూ.300లోపే ఉంటే 2020–21లో ఆ మొత్తం దాటింది. జాతీయ స్థాయి కూలీల సగటు వేతనం కన్నా రాష్ట్రంలోని కూలీల వేతనం ఎక్కువగా ఉంది. అలాగే, జాతీయ స్థాయి విషయానికొస్తే 2019–20లో వ్యవసాయ కూలీల రోజువారీ వేతనం రూ.287.1లు ఉంటే రాష్ట్రంలో అది రూ.302.6గా ఉంది. అలాగే, 2020–21లో జాతీయ స్థాయిలో కూలీల రోజువారీ సగటు వేతనం రూ.309.9 ఉంటే.. రాష్ట్రంలో రూ.318.6లు గా ఉంది.

కేరళలో విద్యాధికులు ఎక్కువగా ఉండడం వల్ల కూలీల కొరత కూడా ఉండి ఉండాలి.

tags : kerala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info