A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బూతుపై ముఖ్యమంత్రి జగన్ ఆవేదన- విశ్లేషణ
Share |
November 30 2021, 7:37 am

దేశ రాజకీయాలలో ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని బూతులు తిట్టిన సందర్భం ఇదేనేమో!అలాగే ఆ ముఖ్యమంత్రి స్వయంగా ఆ బూతు పదం గురించి ఒక సభలో వివరించి ఆవేదన వ్యక్తం చేసిన ఘట్టం కూడా ఇదే కావచ్చు. ఎపి ముఖ్యమంత్రి జగన్ ఆవేదన గురించే ఈ విషయం అన్న సంగతి అర్దం అయ్యే ఉంటుంది. పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో జగన్ ఆవేదనాభరిత ఉపన్యాసం చేశారు. రాష్ట్రంలో గొడవలు చేయడానికి ప్రతిపక్ష తెలుగుదేశం ఎలాంటి కుట్రలు చేస్తున్నది ఆయన ప్రజలకు వివరించారు. అంతేకాక టిడిపి అదికార ప్రతినిది పట్టాభి భూషడికే అంటూ, అరే,ఓరే అంటూ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి దారుణమైన పదజాలాన్ని కూడా జగన్ వివరించారు. తద్వారా ఆయన ప్రజలకు తన బాదను తెలియచేశారనుకోవాలి. దానికి ప్రతిస్పందనగా కొందరు టిడిపి ఆఫీస్ మీదకు దాడి చేసి అద్దాలు పగులకొట్టిన విషయంపై టిడిపికి మద్దతు ఇచ్చే మీడియా విస్తారంగా ప్రచారం చేస్తూ, అసలు పట్టాభి ఏమి దూషించింది చెప్పకుండా జాగ్రత్తపడ్డారు.ఈ నేపధ్యంలో తొలుత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భూషడికే అంటే అర్దం ఇది అంటూ మీడియా సమావేశంలో వివరించారు. అయినా టిడిపి మీడియా దానిని పెద్దగా కవర్ చేయకుండా జాగ్రత్తపడింది. ఈ నేపద్యంలో స్వయంగా ముఖ్యమంత్రి తనను టిడిపి వారు ఏ విధంగా దూషించింది ప్రజలకు వివరించే యత్నం చేశారు. ఇది అరుదైన ఘట్టం. గతంలో కూడా కొందరు ముఖ్యమంత్రులను ప్రతిపక్షాలకు చెందినవారు విమర్శలు చేసి ఉండవచ్చు.కాని ఇంత నీచంగా టిడిపి నేతలకు వలే ఎవరూ తిట్టి ఉండకపోవచ్చు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రిని ఉద్దేశించి చెత్త నాకొడుకు..అంటూ బూతులు తిడితే పట్టాభి మరో అడుగు ముందుకు వేసి భూషడికే అంటూ దూషణలకు దిగాడు. అయినా ప్రతిపక్ష నేత, నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ దూషణలను ఖండించకపోగా సమర్దించే రీతిలో మాట్లాడడం దారుణమైన సంగతే. ఆయన పట్టాభితో ఆ మాటలను ఉపసంహరింప చేయించి ,క్షమాపణ చెప్పించి ఉంటే హుందాగా ఉండేది. ఆ తర్వాత తన పార్టీ ఆఫీస్ పై దాడి గురించి ప్రస్తావించి ఉంటే పద్దతిగా ఉండేది. అప్పుడు ప్రభుత్వం స్పందించకపోతే దీక్షకు దిగినా అర్దం ఉండేది.అలాకాకుండా పట్టాభి చేసింది పోరాటమని, మాట్లాడే స్వేచ్చలేదా అంటూ దారుణంగా మాట్లాడి సమాజానికి ఆయన తప్పుడు సంకేతం పంపించారు. ముఖ్యమంత్రిని తిట్టమని పట్టాభిని చంద్రబాబే ప్రోత్సహించారని వైసిపి నేతలు అనుమానం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో జగన్ తన ప్రసంగంలో రాష్ట్రంలో గొడవలు సృష్టించడానికి, రాష్ట్రం పరువు తీయడానికి డ్రగ్స్ పేరుతో కొందరు కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘‘నేరాల్లో కొత్త కోణం కనిపిస్తోంది. అధికారం దక్కలేదని చీకట్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.. ఆలయాల రథాలను తగలబెట్టారు. అధికారం దక్కలేదని సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారు.. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. పేద పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియాన్ని అడ్డుకున్నారు. చివరకు ముఖ్యమంత్రిని కూడా దారుణమైన బూతులు తిడుతున్నారు. ఇది కరెక్టేనా.. ఇలా తిట్టడం కరెక్టేనా.. ఆలోచించండి. సీఎంను అభిమానించే వాళ్లు తిరగబడాలి.. తద్వారా గొడవలు సృష్టించాలని కుట్రలు చేస్తున్నారు. అని జగన్ వ్యాఖ్యానించారు. జగన్ చెప్పినట్లు ప్రతిపక్ష టిడిపి ఎలాగైనా ఎపిలో అస్థిరత సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. జగన్ ప్రభుత్వాన్ని ముందుకు కదలనివ్వకుండా ,ఉక్కిరి బిక్కిరి చేయడానికి పలు వ్యూహాలు అమలు చేస్తోంది. ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే జరుగుతోందన్న భావన ఉంది.డ్రగ్స్ మీద ఆరోపణలు చేయడం కాని, ఆ తర్వాత పట్టాభితో దూషణలు చేయించడం కాని,తదుపరి వైసిపి అభిమానులు టిడిపి ఆఫీస్ పై దాడిని పురస్కరించుకుని రాష్ట్రంలో బంద్ కు పిలుపు ఇవ్వడం కాని, అది విఫలం కావడంతో దీక్ష పేరుతో కొత్త అంకానికి తెరతీయడం కాని..ఇదంతా ప్లాన్ డ్ గానే కనిపిస్తుంది. బంద్ ను ఎవరూ పట్టించుకోలేదనడానికి చివరికి చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థ కూడా తన వ్యాపారాన్ని యధావిధిగా కొనసాగించడమే. ఈ దీక్షలో కూడా ముఖ్యమంత్రితో పాటు డిజిపిని చంద్రబాబు విమర్శించారు. చాతకాకపోతే పోలీస్ వ్యవస్థను మూసివేయాలని ఆయన అన్నారు. నిజంగానే చంద్రబాబుకు ఆ ఉద్దేశం ఉంటే తన పార్టీ ఆఫీస్ వద్దకాని, తన సెక్యూరిటిని గాని, టిడిపి నేతల సెక్యూరిటీగాని మొత్తం వదలివేసుకుంటున్నామని ప్రకటిస్తే అప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడవచ్చు. ఒక పక్క పోలీసుల సేవలను తీసుకుంటూనే, మరో వైపు ఆ వ్యవస్థనే మూసివేయాలని అనడం చంద్రబాబు ద్వంద్వ నీతికి దర్ఫణంగా కనిపిస్తుంది.పోలీసులు పట్టాభిని అరెస్టు చేయడం ద్వారా తమ బాద్యత నిర్వహించారు.అలాగే టిడిపి ఆఫీస్ అద్దాలు పగులకొట్టినవారిపై కూడా చర్య తీసుకున్నారు. నిజానికి టిడిపిలోనే చంద్రబాబు చర్యలు కాని, పట్టాభివంటివారికి ప్రాముఖ్యత ఇస్తున్న తీరుపై కాని బిన్నాభిప్రాయాలు ఉన్నాయట.అయితే ఇదంతా చంద్రబాబు నియమించుకున్న వ్యూహకర్త ఆలోచనల ప్రకారం జరుగుతున్నాయని కొందరు చెబుతున్నారు. ఎప్పుడూ ఏదో ఒక అలజడి సృష్టించడం, వైసిపి వారిని రెచ్చగొట్టడం, ఇతర అంశాల జోలికి వెళ్లకుండా ఎపిలో అశాంతిని నెలకొల్పడం లక్ష్యంగా కుట్రలు చేస్తున్నారట. కొసమెరుపు ఏమిటంటే ప్రజాస్వామ్యం కోసం ఏమి చేయాలో అది చేస్తానని చంద్రబాబు అనడం. చంద్రబాబులో ప్రజాస్వామ్యం, నేతిబీరకాయలో నెయ్యి చందమేనని ఆయన గత ఐదేళ్ల పాలన చాలా స్పష్టంగా రుజువు చేసింది. అయినా ఆయా వ్యవస్థలలో తన మనుషుల ద్వారా తన పార్టీవారికి ఇబ్బంది లేకుండా చేయగలనన్న ధీమాతోనే చంద్రబాబు కాని, ఆయన టీమ్ కాని ఇలాంటి అకృత్యాలకు తెగబడుతున్నారా అన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడుతోంది.దీనివల్ల టిడిపికి వచ్చే రాజకీయ లబ్ది శూన్యమే అని చెప్పాలి. పైగా ముఖ్యమంత్రి జగన్ తనను టిడిపి వారు ఏమని దూషించారో విడమరచి చెప్పిన తర్వాత టిడిపి పూర్తి గా ఆత్మరక్షణలో పడినట్లయింది.కొసమెరుపు ఏమిటంటే మీపై ఏ కేసులు వచ్చినా తాను చూసుకుంటానని ఆయన చెప్పినట్లుగానే పట్టాభిని ఇరవైనాలుగు గంటల్లో విడుదల అయ్యేలా చేయడంలో సఫలం అయ్యారు. ఆయనకు ఉన్న లాయర్లు అంత సమర్దులనుకోవాలి.

tags : ap,jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info