A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ కు 420 కోట్ల పిక్స్ డ్ డిపాజిట్లా-రేవంత్
Share |
November 30 2021, 7:52 am

తెలంగాణ రాష్ట్ర సమితికి భారీ ఎత్తున డిపాజిట్లు ఉండడంపై పిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టీఆర్​ఎస్​ పార్టీకి రూ. 420 కోట్ల ఫిక్స్​డ్​ డిపాజిట్లు ఉన్నాయంటే వారి వసూళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యనించారు. టిఆర్ఎస్ పార్టీకి వచ్చిన విరాళాలపై ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కెసిఆర్ ప్రకటన చేసినదానిపై రేవంత్ ఈ విమర్శలు చేశారు. టీఆర్​ఎస్​ ప్లీనరీ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి బదులు తెలుగు తల్లి విగ్రహం పెట్టారని రేవంత్​ అన్నారు. తె‘‘ప్లీనరీకి ఆంధ్రా కాంట్రాక్టర్లు పెట్టుబడులు పెట్టారని, తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటు చేసి వాళ్లను సంతృప్తి పరిచినట్లున్నరు” అని వ్యాఖ్యానించారు. కేసీఆర్​, కేటీఆర్​ ఇద్దరు బొమ్మల్ని మాత్రమే ప్లీనరీలో పెట్టుకున్నారని, ఏడున్నరేండ్లలో సీఎం కేసీఆర్​ సాధించిందేమీ లేదని విమర్శించారు.

tags : revanth

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info