A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆంద్రలోనే ఉంటామన్న కొఠియా గ్రామాల వాసులు
Share |
November 30 2021, 8:14 am

తాము ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటామని విజయనగరం సరిహద్దు గ్రామాలైన కొఠియా గ్రామాల వారు చెబుతున్నారన్న కధనం ఆసక్తికరంగా ఉంది. తెలంగాణలోని కొన్ని స్కీములకు ఆకర్షితులై తమను ఈ రాష్ట్రంలోనే కలపాలని పొరుగు రాష్ట్రాల వారు అడుగుతున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన రోజే ఒడిషాసరిహద్దు కు చెందిన కొఠియా గ్రామస్తులు తాము ఎపిలో ఉంటామంటూ తీర్మానం చేశారన్న వార్త వచ్చింది. ఆంద్రలో అమలు చేస్తున్న స్కీములకు వారు ఆకర్షితులయ్యారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ రైతుభరోసా, జగనన్న చేయూత, వైఎస్సార్‌ ఆసరా వంటి సంక్షేమ పథకాలు తమను ఎంతగానో ఆదుకుంటున్నాయని వారు చెబుతున్నారు.
ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో వివాదాస్పదంగా మారిన కొటియా, గంజాయిభద్ర, పనికి, రణసింగి, దిగువశెంబి, ఎగువ శెంబి, సినివలస, కోనదొర తదితర కొటియా గ్రూపు 21 గ్రామాల నుంచి 50 మంది సోమవారం విజయనగరం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమానికి వచ్చారు. కలెక్టర్‌ ఎ.సూర్యకుమారిని కలిసి తమ గ్రామాల సమస్యలను విన్నవించారు.

తాము ఆంధ్రులమని, తమది ఆంధ్రప్రదేశ్‌ కాబట్టి ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి తమకు రక్షణ కల్పించాలని విన్నవించారు.ఇటీవల కాలంలో కోరాపుట్‌ ఎమ్మెల్యే, పోలీసులు తమపై రౌడీయిజం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కూర్మనాథ్‌ను కూడా కొటియా గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని వివరించారు.

tags : andhra, odisha

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info