A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాష్ట్రపతి వరకు వెళ్లిన టిడిపి ఆలోచన
Share |
November 30 2021, 8:18 am

మొత్తం మీద తెలుగుదేశం ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న ఆలోచనను రాష్ట్రపతి వరకు తీసుకు వెళ్లారు.డిల్లీలో రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ ను కలిసి ఎపిలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరిన తర్వాత మీడియాతో మాట్లాడారు. గతంలో ఆర్టికిల్ 356 కు వ్యతిరేకం అని చెప్పిన టిడిపి ఇప్పుడు ఎపిలో మాత్రం అమలు చేయాలని కోరుతోంది.ప్రభుత్వ ప్రేరిత ఉగ్రవాదం కొనసాగుతోందని ఆయన విమర్శించారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా వాటి మూలాలు ఎపిలో ఉంటున్నాయని ఆయన చెప్పారు. తాము సమస్యను లేవనెత్తితే టిడిపి ఆఫీస్ పై దాడి చేశారని, ఇలాంటి ఘటన ఎక్కడా జరగలేదని ఆయన అన్నారు. పోలీసులు వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తమ పోరాటం ప్రజాస్వామ్యయుతంగా సాగుతుందని ఆయన చెప్పారు.

tags : chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info