A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో అద్బుతమైన ప్రస్తానం-కెసిఆర్
Share |
November 30 2021, 8:25 am

తెలంగాణ వస్తే ప్రజలకు చాలా నష్టం జరుగుతుందని దుష్ప్రచారం చేశారని, కాని ఇప్పుడు తెలంగాణ అనేక రంగాలలో అగ్రభాగంలో ఉందని కేంద్ర లెక్కలు చెబుతున్నాయని ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అద్యక్షుడు కెసిఆర్ అన్నారు. టిఆర్ఎస్ అద్యక్షుడుగా తొమ్మిదో సారి ఎన్నికైన తర్వాత ఆయన ప్రసంగించారు. ఒకప్పుడు పంజాబ్ వ్యవసాయంలో అగ్రబాగంలో ఉంటుందని అంటారని, కాని ఇప్పుడు తెలంగాణ దానిని మించి పోయిందని అన్నారు. తెలంగాణలో ఇప్పుడు పండే పంటను ఎప్ సిఐ కొనుగోలు చేయలేని పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ అబివృద్దిలో మిషన్ భగీరద, మిషన్ కాకతీయ తదితర స్కీముల ద్వారా ఎంతో ప్రగతి సాదించామని ఆయన అన్నారు. పల్లెల్లో ప్రకృతి వనాలు, ప్రగతి పనులు ఎన్నో జరిగాయని అన్నారు. ఇదంతా తన ఒక్కడి వల్లే సాద్యం కాదని, ఎమ్మెల్యేలు, ఎమ్ఎల్సీలు, పలువురు నేతల కృషి ఉందని అన్నారు. పరిశ్రమల రంగం, ఐటి ఎగుమతులు ఇలా ఒకటేమిటి? అన్ని రంగాలలో కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ సమాజ అబివృద్దే తమ మతమని కెసిఆర్ అన్నారు. తెలంగాణలో అద్బుతమైన ప్రస్తానం సాగుతోందని కెసిఆర్ చెప్పారు.

tags : kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info