A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
షర్మిల ఒంటరిగానే పోటీచేస్తారా
Share |
November 30 2021, 8:40 am

తెలంగాణలో పాదయాత్రలో నిమగ్నమై ఉన్న వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అద్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికరమైన విషయమే చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీలతో పొత్తులు పెట్టుకోబోమని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని షర్మిల స్పష్టం చేశారు. అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. బీజేపీతో వైఎస్సార్టీపీ పొత్తు ఉంటుందని టీఆర్‌ఎస్‌ అనడం వారి అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్‌ కేసులకు భయపడి ఢిల్లీలో నరేంద్ర మోదీ, అమిత్‌షాల వద్దకు వెళ్లి ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో కేసీఆర్‌ అవినీతి చిట్టా ఉన్నా.. తమకు భవిష్యత్తులో అవసరమొస్తారనే ఉద్దేశంతో ఏమీ అనడం లేదన్నారు. కేసీఆర్‌ ఫాం హౌస్‌లకు సాగునీరు అందించేందుకే కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన నిర్మించారని ఆరోపించారు. కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్‌ పొత్తు ఉంటుందని జోస్యం చెప్పారు. దివంగత నేత వైఎస్సార్‌ పాలనలో సువర్ణ పాలన కొనసాగిందని, వైఎస్సార్టీపీకి ఆవకాశం ఇస్తే మళ్లీ రాజన్న రాజ్యం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

షర్మిల పార్టీ ఒంటరిగానే పోటీచేస్తే ఫలితాలు ఆమెకు బాగానే ఉంటాయా?

tags : ys sharmila

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info