A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రేవంత్ ఆరోపణలో నిజం ఉందా
Share |
November 30 2021, 8:46 am

తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలే చేస్తుంటారు. అదే కోవలో పోలీస్ శాఖ కులాల వారీగా రెండు వర్గాలుగా అయిందని, డిజిపి మహేందర్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నేతల పోన్ లు టాప్ అవుతున్నాయని ఆరోపించి కలకలం రేపారు.
ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టులుగా పేరొందిన కరీంనగర్‌ జిల్లాకు చెందిన వేణుగోపాల్‌రావు, నర్సింగరావు, ప్రవీణ్‌రావు, రమణకుమార్‌లతో కూడిన 30 మంది బృందంతో రాజకీయ నేతలపై ఆధునిక సాంకేతికతతో నిఘా పెట్టారని, దీని కోసం ఓ విశ్రాంత ఐపీఎస్‌ నేతృత్వంలో ప్రత్యేక సెల్‌ నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఒకవర్గానికి చెందిన ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా తమవర్గానికి ప్రాధాన్యతనిస్తున్నారని, ఈ మేరకు ఏపీ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి గజానన్‌ని డిప్యుటేషన్‌ మీద తీసుకువచ్చారని ఆరోపించారు. తనకు అనుకూలమైన అధికారులకు హైదరాబాద్‌లో పోస్టింగులు ఇప్పించుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు.

రేవంత్ పోలీసులలో కొందరిని ఆకట్టుకోవడానికి మాట్లాడుతున్నారా?లేక నిజం చెబుతున్నారా?

tags : revanth

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info