A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆర్యన్ ఖాన్ కేసు- 25 కోట్ల ఆరోపణ నిజమేనా!
Share |
November 30 2021, 8:53 am

ఇది నిజమైన ఆరోపణా?లేక పట్టుబడ్డాడు కనుక ఇలాంటి ఆరోపణ చేస్తున్నారు. ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ పై వచ్చిన డ్రగ్స్ కేసులో అతనిని తప్పించడానికి పాతిక కోట్లు అడిగారని వచ్చిన ఆరోపణ తీవ్రమైనదే. ఆర్యన్‌ఖాన్‌ను విడిచిపెట్టడానికి నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులతో రూ.25 కోట్లకు డీల్‌ కుదిరిందని ప్రభాకర్‌ సాయిల్‌ అనే సాక్షి సంచలన ఆరోపణలు చేశారు. ఆ మొత్తంలో రూ.8 కోట్లు ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడేకి ముట్టజెప్పాలని ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ప్రభాకర్‌ తాను సమరి్పంచిన అఫిడవిట్‌లో ఆరోపించారు. ప్రైవేట్‌ డిటెక్టివ్‌ కె.పి. గోసవికి వ్యక్తిగత అంగరక్షకుడినని చెప్పుకుంటున్న ప్రభాకర్‌ అక్టోబర్‌ 2న క్రూయిజ్‌ నౌకపై దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు. దీంతో ఎన్‌సీబీ గోసవిని, ప్రభాకర్‌ని సాక్షులుగా చేర్చి విచారించింది. ఈ అరెస్ట్‌ల తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని శామ్‌ డిసౌజా అనే వ్యక్తితో కేపీ గోసవి ఫోన్‌లో ఈ డీల్‌ గురించి మాట్లాడుతుంటే తాను అదే కారులో ఉండి విన్నానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత షారూక్‌ఖాన్‌ మేనేజర్‌ పూజా దడ్లానితో కారులోనే ఈ డీల్‌ గురించి 15 నిముషాల సేపు చర్చించారని ప్రభాకర్‌ తెలిపారు.

tags : aryan khan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info