A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రేవంత్ పై కెటిఆర్ ఘాటు వ్యాఖ్య
Share |
October 26 2021, 5:18 pm

సున్నాలు వేయడం నుంచి కన్నాలు వేసే వరకు వచ్చిన ఒక వ్యక్తికి జూబ్లిహిల్స్ లో నాలుగు బంగళాలు ఎలా వచ్చాయని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. ఆయన పిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డిపై పరోక్ష విమర్శలు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ లో జరిగిన కాంగ్రెస్ దండోరా సభపై ఆయన స్పందించారు.
‘కాంగ్రెస్‌ పార్టీ గజ్వేల్‌లో కాదు... మరో నూరు చోట్ల సభ పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు అందమైన ఆర్చీల ఫొటోలు పెట్టి ప్లాట్ల బేరం చేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి కొనుక్కున్న వ్యక్తి పార్టీ టికెట్లు అమ్ముకునేందుకు మార్కెట్లో గిరాకీ ఉందని చూపెట్టుకొనేందుకు సభల పేరిట హడావుడి చేస్తున్నాడు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌కు రేవంత్‌రెడ్డి రూ. 50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నట్లు ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. 2018లో గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేసిన ప్రతాప్‌రెడ్డి కూడా పెద్ద సభ పెట్టి కేసీఆర్‌ను దూషించినా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు కాబట్టే టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. కేసీఆర్‌ను తాగుబోతు అంటూ చిల్లరగా మాట్లాడుతున్న వారి బట్టలు ఊడదీస్తాం. సున్నాలు వేసే స్థాయి నుంచి కన్నాలు వేసే స్థాయికి ఎదిగిన వ్యక్తికి జూబ్లీహిల్స్‌లో నాలుగు విలాసవంతమైన బంగళాలు ఎక్కడ నుంచి వచ్చాయి? అందరి బాగోతాలు వెలికితీస్తాం’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై చార్జిషీట్లు విడుదల చేయడాన్ని ప్రస్తావిస్తూ ‘క్రిమినల్స్, రోజూ కోర్టుల చుట్టూ తిరిగే వాళ్లకు మాత్రమే చార్జిషీట్లు తెలుసు’అని ఎద్దేవా చేశారు. సీఎం ఫాంహౌస్‌లో పడుకుంటేనే దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలు అవుతున్నాయా? అని ప్రశ్నించారు.

tags : ktr, revanth

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info