A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెటిఆర్ సీరియస్ వార్నింగ్
Share |
October 26 2021, 5:24 pm

తెలంగాణ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్ సీరియస్ వార్నింగే ఇచ్చారు. మీడియా వార్తలను చూస్తే ,భవిష్యత్తులో ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు పెడతామని ఆయన హెచ్చరించినట్లు కనబడుతుంది. తనపై వచ్చిన ఆరోపణలకు ఆయన సూటిగా సమాధానం చెప్పారు.ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


‘విపక్షాలు బఫూన్, బేవకూఫ్‌ మాటలు కట్టిపెట్టాలి. ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రతి చిల్లరగాడూ మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో ఎవరూ తాగుతలేరా? సమాజంలో తాగడం సాధారణ విషయం. ముఖ్యమంత్రి తాగితేనే లిక్కర్‌ అమ్మకాలు పెరిగాయా? ఊరూపేరు లేని వ్యక్తులు కేసీఆర్‌ను దూషిస్తుంటే సహించేది లేదు. ఉద్యమ సమయంలో అప్పటి ఉద్వేగాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్‌ మాట్లాడటంలో అర్థముంది. ఇక నుంచి మాపై చేసే విమర్శలకు పదింతలు తిరుగు సమాధానం ఇస్తాం. తెలంగాణ పురోగతి, ప్రతిష్టను దెబ్బతీసేలా ఫాల్తూ మాటలు మాట్లాడితే మహారాష్ట్రలో కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణేపై కాంగ్రెస్‌ భాగస్వామ్య ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశద్రోహం కేసులు పెడతాం’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు హెచ్చరించారు. శనివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ ‘నాకు, డ్రగ్స్‌కు సంబంధం ఉందని మాట్లాడుతున్న వాడు మనిషా, పశువా? ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌కు ఎవరో ఏదో లేఖ ఇస్తే నాకేం సంబంధం. లెటర్‌ ఇచ్చిన వాడు ఒక బఫూన్‌. అయినా నా రక్తం, వెంట్రుకలతోపాటు అవసరమైతే లివర్‌ ముక్కను కూడా డ్రగ్స్‌ అనాలసిస్‌ పరీక్షకు ఇచ్చేందుకు సిద్ధం. రాహుల్‌ గాంధీ కూడా ఇందుకు రెడీయా?’అని సవాల్‌ విసిరారు.

tags : ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info