A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అయ్యన్న దూషణలు భరించలేకే
Share |
October 26 2021, 5:22 pm

ముఖ్యమంత్రి జగన్ పైన, మంత్రులపైన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన చెప్పడానికి వెళ్లిన తనపై చంద్రబాబు గూండాలు దాడి చేశారని వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ చెప్పారు. అయ్యన్నపాత్రుడు నోటికి వచ్చినట్లు దూషణలు చేశారని, వాటిని భరించలేకే తాను నిరసనకు వెళ్లానని ఆయన అన్ఆరు. అయ్యన్నపాత్రుడు తో చంద్రబాబు క్షమాపణ చెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఎపిలో పనికిమాలిన ప్రతిపక్షం ఉందని ఆయన అన్నారు. లోకేష్ కు లోకజ్ఞానం లేదని, వార్డు మెంబర్ గా కూడా గెలవలేడని ఆయన అన్నారు. పచ్చపత్రికలు వక్రీకరించి రాతలు రాశాయని ఆయన పేర్కొన్నారు. తన కారుపై దాడి చేసి అద్దాలు పగులకొట్టారని, రాళ్లతో దాడి చేశారని ఆయన చెప్పారు. అయ్యన్నపాత్రుడు వంటి పనికిమాలిన వారిని ప్రజలు తరిమి కొడతారని ఆయన అన్నారు.ఎపిలో టిడిపిది ముగిసిన అద్యాయమని రమేష్ వ్యాఖ్యానించారు.

tags : jogi ramesh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info