A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ అవినీతి చిట్టా మోడీ వద్ద ఉంది
Share |
October 26 2021, 5:28 pm

దళితబంధును హుజూరాబాద్, నాలుగు మండలాలు కాకుండా రాష్ట్రమంతా ఏకకాలంలో అమలు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు.గజ్వేల్ సభలో ఆయన తోపాటు పలువురు నేతలు మాట్లాడారు . ఇతర వర్గాలకు కూడా ఇలాంటి పథకాలు అమలు చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ అవినీతి చిట్టా కట్టలు అన్నీ మోదీ దగ్గర ఉన్నాయని ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ అన్నారు. ఏడున్నర సంవత్సరాల్లో రాష్ట్రాన్ని రాబందుల సమితిగా కేసీఆర్‌ మార్చారని విమర్శించారు. కేసీఆర్‌ దీపం ఆరిపోతుంది, కాంగ్రెస్‌ దీపం వెలుగుతుందని రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ అన్నారు. దళిత బంధు మాదిరిగా బీసీ బంధు సైతం అమలు చేయాలని మాజీ ఎంపీ వి.హన్మంతరావు డిమాండ్‌ చేశారు.

tags : madhu yaskhi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info