A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గజ్వేల్ సభకు 2 లక్షల మంది వచ్చారా!
Share |
October 26 2021, 5:35 pm

రాష్ట్రంలో తుదిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.గజ్వేల్ లో జరిగిన గిరిజన ,దళిత దండోరా సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్‌ పార్టీ ధర్మ యుద్ధం చేస్తుందని చెప్పారు. అక్టోబర్‌ 2 నుంచి డిసెంబర్‌ 9 వరకు ఈ కార్యాచరణ కొనసాగుతుందని, సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో బహిరంగసభ నిర్వహిస్తామని వెల్లడించారు. గజ్వేల్‌ సభలో 2 లక్షల మందితో కదం తొక్కామని చెప్పారు. గంజాయి మత్తులో చిన్నారిపై అత్యాచారం జరిపి, హత్యచేస్తే పోలీసులను పిలిచి కనీసం సమీక్ష చేయని సీఎం కేసీఆర్‌ ఓ మానవ మృగమని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ మద్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అయితే రాష్ట్రంలో కొనసాగుతున్న డ్రగ్స్‌కు డ్రామారావు బ్రాండ్‌ అంబాసిడరని మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి ఆరోపించారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌ ఓ అవినీతి తోట అని ఆరోపించారు.తెలంగాణ ఉద్యమ సమయంలో సాధారణ వ్యక్తి అయిన కేసీఆర్‌ కుటుంబానికి వందల ఎకరాల్లో ఫాంహౌస్‌లు, ఆస్తులు, అంతస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

tags : revanth

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info