A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టి. ఇచ్చింది మేము.. అధికారం మాత్రం కెసిఆర్ కు
Share |
October 26 2021, 5:42 pm

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి దేశంలో అధికారం అప్పగిస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ లో ఆ పక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. టీపీసీసీ ఆధ్వర్యంలో శుక్రవారం గజ్వేల్‌లో జరిగిన ’దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సభకు రాహుల్‌ గాంధీ హాజరు కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని, తనపై ఈ బాధ్యతను పెట్టి ఈ సభకు పంపారని చెప్పారు. ‘ఈ దేశం కోసం కాంగ్రెస్‌ పార్టీ గత 70 ఏళ్లలో ఏం చేసిందని ప్రధాని మోదీ ప్రశ్నిస్తున్నారు. దేశంలో మోదీ ప్రధాని అయ్యాక, తెలంగాణలో కేసీఆర్‌ సీఎం అయ్యాక మాత్రమే అభివృద్ధి జరిగి నట్టు చెబుతున్నారు. కానీ అసలు దేశానికి స్వాతంత్య్రం తెచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ. కాంగ్రెస్‌ వాదులు ఈ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడినప్పుడు మోదీ, కేసీఆర్‌లు పుట్టలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే తెలంగాణకు స్వాతంత్య్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్‌ పార్టీయే. అయితే అధికారాన్ని అనుభవిస్తోంది మాత్రం కేసీఆర్, ఆయన కుటుంబం..’ అని ఖర్గే విమర్శించారు.

tags : mallikharjun kharge

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info