A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అయ్యన్నపాత్రుడికి పిచ్చెక్కినట్లు ప్రకటించాలి
Share |
October 26 2021, 5:55 pm

ముఖ్యమంత్రిని, మంత్రులను నోటికి వచ్చినట్లు దూషించిన అయ్యన్నపాత్రుడును వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు హెచ్చరించారు. అయ్యన్నపాత్రుడు దూషణలకు దిగడం సరికాదని, అవాకులు, చవాకులు పేలితే ప్రజలు నాలుక తెగ్గోస్తారని హెచ్చరించారు. అయ్యన్న తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదా ఆయనకు పిచ్చెక్కిందని చంద్రబాబు ప్రకటించాలని కోరారు.మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుది ముమ్మాటికీ చంద్రబాబు చేసిన హత్యేనని ఆయన ఆరోపించారు. కోడెల ఆత్మహత్యకు నెల ముందు బలవన్మరణానికి ప్రయత్నించి.. ఆయన అల్లుడి వైద్యశాలలో చికిత్స పొందితే పరామర్శించడానికి కూడా చంద్రబాబు రాలేదని గుర్తు చేశారు. అంతేకాకుండా పార్టీ నుంచి కోడెలను బయటకు సాగనంపాలని చూడటంతో కోడెల తీవ్ర మనస్తాపం చెందారన్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేశారు. ఈ వాస్తవం సత్తెనపల్లి చుట్టుపక్కల వారందరికీ తెలుసన్నారు. అయ్యన్న ఇది గమనించాలని కోరారు.

tags : ambati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info