A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మందు ఉంటే మత్తు మాటలు-లేకుంటే మాయ..
Share |
October 26 2021, 5:28 pm

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి తీరుపై వైసిపి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు.
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు. సొంత ఇల్లు సహా 358 సర్వే నంబర్‌లో 22ఎలో ఉంటే అధికార పైరవీలతో మార్చుకున్న నాయకుడు అయ్యన్న అని ధర్మశ్రీ ఆరోపించారు.
రంగు రాళ్ల కుంభ కోణంలో అయ్యన్న దోపిడి అందరికీ తెలుసని, కరక క్వారీ తవ్వకాల్లో అయ్యన్న రంగు ఎప్పుడో బయటపడిందని అన్నారు. మందు ఉంటే మత్తు మాటలు, మందు లేకపోతే మాయమాటలు అయ్యన్నకు అలవాటు దుయ్యబట్టారు. చోడవరం బ్రిడ్జి పూర్తి కాకపోతే ఆరు నెలల్లో గుండు గీయించుకుంటానని కనిపించకుండా పోయాడని ఎద్దేవా చేశారు. అయ్యన్న గుండు గీయించుకోలేక తప్పించుకున్నా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఆ బ్రిడ్జి పూర్తి చేశామని తెలిపారు.

tags : ayyannapatrudu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info