A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పంజాబ్ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా
Share |
October 26 2021, 4:17 pm

పంజాబ్ లో కాంగ్రెస్ సంక్షోభం ముదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం ప్రత్యేకంగా కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేస్తుండడంతో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ లో జరిగిన పరిణామాలతో తాను విసిగిపోయానని ఆయన అదిష్టానానికి చెప్పారట. కాంగ్రెస్ ఇన్ చార్జీ రావత్ గత రాత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సమావేశానికి రావాలని చెప్పడం, పిసిసి అద్యక్షుడు నవజోత్ సిద్దూ కూడా అదే విధంగా కోరడం ఊహాగానాలకు తెరతీసింది. అమరీందర్, సిద్దూ వర్గాల మధ్య ఉప్పు,నిప్పుగా రాజకీయం సాగుతోంది. వీరి మద్య రాజీ చేయడానికి అదిష్టానం చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. ఇప్పుడు కొత్త నాయకుడు ఎవరు అవుతారన్నది , నిజంగానే అమరీందర్ రాజీనామా చేస్తారా అన్నది పెద్ద చర్చగా ఉంది.

tags : amarendar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info