A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జస్టిస్ కనగరాజ్ నియామకం ప్రభుత్వ తప్పేనా
Share |
October 26 2021, 6:19 pm

జస్టిస్ కనగరాజ్ ను గౌరవించాలన్న ఉద్దేశంతో ఎపి ప్రభుత్వం చేసిన నియామకం హైకోర్టులో చెల్లలేదు. నాలుగువారాల పాటు సంబంధిత జిఓను హైకోర్టు సస్పెండ్ చేసింది. దానికి కారణం పోలీస్ కంప్లైంట్ అధారిటీ చైర్మన్ గరిష్ట వయసు 65 మాత్రమే కాగా, డెబ్బైఎనిమిది సంవత్సరాల కనగరాజ్ ను నియమించడమే. దీనికి సంబంధించి వచ్చిన పిటిషన్ కు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ పోలీస్‌ కంప్‌లైంట్‌ అథారిటీ చైర్మన్‌లతో పాటు జస్టిస్‌ కనగరాజ్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వివరాల ప్రకారం , పిటిషనర్‌ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ.. జస్టిస్‌ కనగరాజ్‌ వయసు 78 సంవత్సరాలని, చట్ట ప్రకారం చైర్మన్‌గా నియమితులయ్యే వ్యక్తి 65 సంవత్సరాలు వచ్చేవరకు మాత్రమే ఆ పదవిలో కొనసాగేందుకు వీలుందని తెలిపారు. వయసురీత్యా జస్టిస్‌ కనగరాజ్‌ నియామకం చట్ట నిబంధనలకు విరుద్దమని ఆయన వివరించారు.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫారసు చేసిన ప్యానల్‌ నుంచి చైర్మన్‌ నియామకం జరగాలని చట్ట నిబంధనలు చెబుతున్నాయన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మానం ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే వయసు రీత్యా జస్టిస్‌ కనగరాజ్‌ నియామకం చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉందని, అందువల్ల ఆయన నియామక ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తున్నామని స్పష్టం చేసింది.
.............
ఇలాంటి నియామకాలు చేసేటప్పుడు ప్రభుత్వానికి అధికారులు తగు సలహాలు ఇవ్వాలి కదా?ఇలా అనవసర లిటిగేషన్ లలో చిక్కుకోవడం సరికాదు కదా!

tags : ap highcourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info