A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పరిషత్ ఎన్నికల కౌంటింగ్ -తీర్పు ఆసక్తికరం
Share |
October 26 2021, 4:13 pm

ఎపిలో మండల, జడ్పి ఎన్నికల కౌంటింగ్ కు అనుమతిస్తూ డివిజన్ బెంచ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. మీడియాలో దీనికి సంబందించిన కధనం వచ్చింది.గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులోని పలు అంశాలను ప్రస్తావించి ఆ తీర్పును కొట్టివేయడం విశేషమే. ఆ వివరాలు కొన్ని ఇలా ఉన్నాయి.


ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఈ ఏడాది ఆగస్టు 1న ఎన్నికల కమిషనర్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌ పోటీ చేసే అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించలేదనడం అర్థం కాకుండా ఉందని తీర్పులో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ నోటిఫికేషన్‌ రాష్ట్రంలో పోటీ చేసే అభ్యర్థులందరికీ వర్తిస్తున్నప్పుడు అది ఏ రకంగా అభ్యర్థుల హక్కులను హరిస్తుందో అర్థం కావడం లేదంది. వాస్తవానికి జనసేన నేత అభ్యర్థన ఎన్నికలను ఎక్కడ ఆపారో ఆ దశ నుంచి కాకుండా తిరిగి మొదటి నుంచి పెట్టాలన్నదేనని, అయితే ఈ అభ్యర్థనను సింగిల్‌ జడ్జి తన తీర్పులో తిరస్కరించారని ధర్మాసనం తెలిపింది.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నాలుగు వారాల ముందు ఎన్నికల నియామావళిని అమలు చేయాలన్న వర్ల రామయ్య అభ్యర్థనను జనసేన నేత వ్యాజ్యంలో పరిగణలోకి తీసుకున్నారని అనుకున్నా.. ఏప్రిల్‌ 1న ఎన్నికల నోటిఫికేషన్‌ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉద్దేశపూర్వకంగా ఇచ్చారని సింగిల్‌ జడ్జి పేర్కొనడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది.

ఎన్నికల కమిషనర్‌ ఏప్రిల్‌ 1న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయడమే కాకుండా, ఎన్నికలను నిలుపుదల చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై వెంటనే ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేయడాన్ని సింగిల్‌ జడ్జి తన తీర్పులో తప్పుపట్టారని, ఇది ఎంత మాత్రం సరికాదని ధర్మాసనం తెలిపింది. చట్టబద్ధంగా అప్పీల్‌ దాఖలు చేసినప్పుడు దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదని సూచించింది.

‘సుప్రీం’ ఆదేశాలను పాటించినట్లే
ఎన్నికల నిర్వహణకు నాలుగు వారాల ముందు నియమావళిని అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అమలు చేశారని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను సంతృప్తిపరచడమే అవుతుందని తీర్పు సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు 4 వారాల ముందు ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్నది సుప్రీంకోర్టు ఆదేశమే తప్ప, ప్రతీ ఎన్నికకు 4 వారాల ముందు నియమావళిని అమలు చేయాలన్నది సుప్రీంకోర్టు ఉద్దేశం కాదని పేర్కొంది.

పిటిషన్‌లో ప్రస్తావించకున్నా..
మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు నాలుగు వారాల పాటు ఎన్నికల నియమావళిని అమలు చేయనప్పుడు టీడీపీ నేత వర్ల రామయ్య ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు తన వ్యాజ్యంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన గురించి కనీసం ఎలాంటి అభ్యర్థన చేయలేదని తెలిపింది. అయినప్పటికీ సింగిల్‌ జడ్జి తన తీర్పులో ఎన్నికల నియమావళి ఉల్లంఘనను జనసేన ప్రస్తావించిందని, నియమావళిని అమలు చేయకపోవడం వల్ల పోటీ చేసే అభ్యర్థుల హక్కులకు విఘాతం కలిగినట్లు నిరూపించారని అందులో పేర్కొన్నారని ధర్మాసనం తెలిపింది. సింగిల్‌ జడ్జి తన తీర్పులో పేర్కొన్న విషయాలను జనసేన నేత తన పిటిషన్‌లో ప్రస్తావించలేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

tags : ap highcourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info