A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిటిడి బోర్డు సభ్యుల సంఖ్య- విమర్శల చాన్స్
Share |
October 26 2021, 4:18 pm

తిరుమల తిరుపతి దేవస్థానం లో ట్రస్టుబోర్డు సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య బాగా పెరగడం సహజంగానే విమర్శలకు దారి తీస్తుంది. అంతా కలిసి 81 మంది అవుతున్నారు.దీంతో వీరిచ్చే రికమెండేషన్ లేఖల వల్లే సుమారు 2100 మందికి దర్శనం , విఐపి బ్రేక్ దర్శనం కల్పించవలసి ఉంటుందని, అందువల్ల సామాన్య భక్తులకు దర్శనం దూరం కావచ్చని అప్పుడే ఒక వర్గం మీడియా ప్రచారం ఆరంభించింది. నిజంగానే సామాన్యులకు దర్శనం ఇబ్బంది వస్తే అది విమర్శలకు తావిచ్చే అవకాశం ఉంది. కాని మరో వైపు కేంద్రం నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి వస్తున్న ఒత్తిడుల నేపధ్యంలో ప్రభుత్వానికి ఈ ఏర్పాటు తప్పి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు విమర్శలు ఎదుర్కోక తప్పదు. అయితే దీనిపై కూడా ఎవరైనా కోర్టుకు వెళతారేమో తెలియదు. అప్పుడు ఏమి అవుతుందో చెప్పలేం.

tags : tirumala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info