A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈటెలకు అమిత్ షా ప్రాధాన్యత
Share |
October 26 2021, 4:55 pm

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటెల పోటీ చేయనున్న నేపద్యంలో అమిత్ షా ఆయన చేయి ఎత్తి ప్రజలకు ఈటెలను గెలిపించాలని కోరారు. దీనికి సభికుల నుంచి మంచి స్పందన వచ్చింది. సభ ప్రారంభంలోనే అందరినీ పేరుపేరునా పలకరిస్తూ ఈటల రాజేందర్ పేరు పలికారు. వెంటనే ఈటల లేచి నిలబడగా ‘ముందుకు రాజేందరన్న’ అంటూ అమిత్‌ షా పిలిచారు. ఈటల కోసం ప్రత్యేకంగా చప్పట్లు కొట్టించారు. ‘రాజేందర్‌ ఎన్నిక వస్తోంది. రాజేందర్‌ను గెలిపిస్తున్నాం కదా! వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నాం కదా’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు.కాగా బిజెపి అద్యక్షుడు బండి సంజయ్ సభలో అమిత్ షా కు పాదాబివందనం చేశారు.

tags : eetala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info