A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపి, టిడిపి ల పరస్పర ఫిర్యాదులు
Share |
October 26 2021, 6:06 pm

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన దూషణలపై వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటివద్ద నిరసన తెలపడానికి వెళ్లడం వివాదాస్పదం అయింది. టిడిపి, వైసిపి వర్గాలు పరస్పర తోపులాటలకు దిగిన తర్వాత ఇరువైపుల నుంచి కేసులు పెట్టుకున్నారు. జోగి రమేష్ తదితరులపై టిడిపి నేతలు కేసులు పెట్టగా అయ్యన్న పాత్రుడు, చంద్రబాబుపై డీజీపీ గౌతం సవాంగ్‌కి వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారిని అరెస్ట్‌ చేయాలని కోరారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రిని దూషించారని వైసిపి ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ఆళ్ల రామకృష్ణారెడ్డి, జోగి రమేష్ తదితరులు ఆరోపించారు. కాగా వైసిపి నేతలు చంద్రబాబు ఇంటిపై ప్లాన్ ప్రకారం దాడి చేశారని టిడిపి నేతలు కనకమేడల రవీందర్ తదితరులు ఆరోపించారు. అయ్యన్నపాత్రుడు అత్యంత నీచంగా మాట్లాడారని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. జోగి రమేష్‌పై భౌతిక దాడికి దిగడం అత్యంత దారుణమన్నారు. అయ్యన్నపాత్రుడితో మాట్లాడించింది చంద్రబాబేనన్నారు. చంద్రబాబు, టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు, అయ్యన్నపై చర్యలు తీసుకోవాలని కోరామని ఆర్కే తెలిపారు.


జోగి రమేష్ ప్రతిపక్ష నేత ఇంటి వద్దకు వెళ్లకుండా వేరే చోట నిరసన తెలిపితే బాగుండేదేమో! అయ్యన్నపాత్రుడు అంత దారుణంగా దూషణలకు దిగడం శోచనీయం.

tags : tdp, ycp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info