A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి ప్రభుత్వంపై జివిఎల్ వ్యంగ్య వ్యాఖ్య
Share |
October 26 2021, 5:10 pm

ఆన్ లైన్ లో సినిమా టిక్కెట్ల విక్రియించాలన్న ఎపి ప్రభుత్వ ప్రతిపాదనపై బిజెపి ఎమ్.పి జివిఎల్ నరసింహారావు విమర్శలు చేశారు. సినిమా టిక్కెట్లు అమ్మాలని ప్రభుత్వం భావిస్తోందని, భవిష్యత్తులో సినిమాలు కూడా తీస్తుందేమోనని ఆయన వ్యంగ్యంగా అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విదాన నిర్ణయం అని ఆయన చెప్పారు. స్టీల్ ప్లాంట్ వృద్ది చెందాలని, ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలని కేంద్రం చూస్తోందని ఆయన అన్నారు. ఎపి ప్రభుత్వం అప్పులేనిదే రోజు గడవ లేని స్థితిలో ఉందని జివిఎల్ వ్యాఖ్యానించారు. రివర్స్ టెండరింగ్ మాదిరి రివర్స్ అబివృద్ది జరుగుతోందని ఆయన విమర్శించారు.

tags : gvl

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info