A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెటిఆర్ సవాల్ -జారిపోయిన బండి సంజయ్
Share |
September 19 2021, 1:56 pm

మంత్రి కెటిఆర్ విసిరిన సవాల్ ను తెలంగాణ బిజెపి అద్యక్షుడు బండి సంజయ్ స్వీకరించలేదు. పైగా కెటిఆర్ ను అజ్ఞాని అని సంభోదించారు. ‘మంత్రి కేటీఆర్‌ అజ్ఞాని, ఆయన సవాల్‌ను నేను స్వీకరించటం ఏంటి.. ఆయన అయ్య వస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల లెక్కలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్ద కూర్చొని చూపిస్తాను’ అని సంజయ్‌ అన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2 లక్షల 74 వేల కోట్లు చెల్లిస్తే, రాష్ట్రానికి తిరిగి ఇచ్చింది రూ.లక్షా 42 వేల కోట్లు మాత్రమేనని, ఇది అబద్ధమని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్‌ విసిరిన సవాల్‌పై సంజయ్‌ పైవిధంగా స్పందించారు. గతంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే 32 శాతం నిధులను మోదీ ప్రభుత్వం 41 శాతానికి పెంచింది నిజం కాదా అని సంజయ్‌ ప్రశ్నించారు.
చారు.

tags : bandi sanjay

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info