A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోరిన రేవంత్
Share |
September 19 2021, 2:19 pm

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను తాను కూడా కలుస్తానని తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. ఈనెల17వ తేదీన రాష్ట్రానికి వస్తున్న అమిత్ షాను ఎంపీ, ఎమ్మెల్యేలతో తాను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్లు చెప్పారు. తెలంగాణ వ్యసనపరులకు స్వర్గధామంగా మారిందని ఆరోపించారు. నూటికి 90 శాతం తాగుబోతులను చేస్తోందని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శించారు. మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగానే చూస్తోందని, ఆ మద్యంమత్తులోనే దారుణ సంఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి కాలనీలో ఘటనపై వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, కఠినంగా శిక్షించాలని హోంమంత్రి, డీజీపీకి మంత్రి కేటీఆర్ ట్వీట్ ఎలా చేశారు? అని ప్రశ్నించారు. ఐదు రోజుల తర్వాత పరారీలో ఉన్నాడని పట్టుకుంటే రూ.10 లక్షల రివార్డు ప్రకటించారని చెప్పారు. అదుపులోనే ఉన్నాడని కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా? అని ఆయన ప్రశ్నించారు.

tags : revanth

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info