A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఫైబర్ నెట్ స్కామ్ లో కేసు బలపడుతోందా
Share |
October 26 2021, 5:49 pm

ఫైబర్ నెట్ స్కామ్ లో కేసు బలపడుతోందా? టెండర్ కోసం టెర్రా సాఫ్ట్ కంపెనీ ఫోర్జరీ పత్రాలు సంపాదించింది వాస్తవమేనని ఈ కేసులో మరో నిందితుడుగా ఉన్న సాంబశివరావు చెప్పారన్న వార్త వచ్చింది.సాంబశివరావు అప్పట్లో ఇన్ కాప్ ప్రభుత్వ సంస్థ ఎమ్.డి. గా ఉన్నారు.విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో కె.సాంబశివరావును అధికారులు మొదట విచారించారు. రెండు దఫాలుగా దాదాపు ఐదు గంటలపాటు సాగిన ఈ విచారణలో సీఐడీ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. కాగా టెరా సాఫ్ట్‌ కంపెనీకి టెండర్లు కట్టబెట్టడంలో తప్పులు జరిగాయని సాంబశివరావు ఒప్పుకున్నట్లు సమాచారం మీడియాలో కధనం వచ్చింది. టెరాసాఫ్ట్‌ కంపెనీ సమర్పించిన ఫోర్జరీ ఎక్స్‌పీరియన్స్‌ పత్రాలు, వాటికి సంబంధించిన డాక్యుమెంటరీ ఆధారాలను సీఐడీ అధికారులు ఆయన ముందుంచి వాటిపై విచారించారు. దాంతో టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగినట్టు ఆయన అంగీకరించాల్సి వచ్చిందని తెలిసింది.టెండర్లలో పాల్గొనేందుకు అర్హత లేకపోయినప్పటికీ, సిగ్నం డిజిటల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరిట ఫోర్జరీ పత్రాలు సమర్పించడం కచ్చితంగా తప్పేనని సాంబశివరావు అంగీకరించారని తెలుస్తోంది. ఆ విధంగా టెరాసాఫ్ట్‌ కంపెనీ సమర్పించిన ఫోర్జరీ పత్రాలు సరైనవే అని చెప్పమని సిగ్నం డిజిటల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సీఈడీ గౌరీశంకర్‌ను బెదిరించడం నేరంగానే పరిగణించక తప్పదని కూడా ఆయన సమ్మతించారని సమాచారం అని ఆ కధనంలో వివరించారు.

tags : fibernet

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info