A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సినిమా టిక్కెట్ల పై పేర్ని నాని వివరణ
Share |
September 19 2021, 1:41 pm

సినిమా పెద్దలు కోరినందునే ప్రభుత్వం టిక్కెట్ ల విక్రయానికి సంబందించిన ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించాలని ఆలోచన చేస్తోందని సమాచార , సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని చెప్పారు. ప్రతి దానికి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే టిడిపికి అలవాటుగా మారిందని ఆయన అన్నారు. ప్రభుత్వం టిక్కెట్ల వ్యాపారం చేస్తుందని ప్రతిపక్షం నోటికొచ్చినట్లు మాట్లాడుతుందని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకం జరగాలని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చెయ్యడం కోసమే ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందన్నారు. కానీ దీనిపై కొందరు మేధావులు బయలుదేరారని ఆయన ఎద్దేవ చేశారు. సినిమా టికెట్లను పారదర్శకంగా ప్రజలకు అందిస్తామన్నారు. త్వరలో సినిరంగ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ ను కలుస్తారని ఆయన అన్నారు.

tags : perni nani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info