A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విచారం వ్యక్తం చేసిన అచ్చెన్నాయుడు
Share |
September 19 2021, 1:52 pm

ఎపి టిడిపి అద్యక్షుడు కె. అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పారు. శాసనసబ్యుడు కూడా అయిన అచ్చెన్నాయుడు కొంతకాలం క్రితం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి అనుచితంగా ఉన్నాయని, అభ్యంతరకరంగా ఉన్నాయని వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ శాసనసభ హక్కుల కమిటీకి పిర్యాదు చేశారు. దీనిపై కమిటీ విచారణ చేపట్టింది. ఈ విచారణకు హాజరైన అచ్చెన్నాయుడు తన విమర్శలపై విచారం వ్యక్తం చేశారు. తాను ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణను కమిటీ సభ్యులందరికి పంపి వారి అబిప్రాయం తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని కమిటీ చైర్మన్ కాకాని గోవర్దనరెడ్డి చెప్పారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని అచ్చెన్న చెప్పారని ఆయన వివరించారు.

tags : acchennaidu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info