A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నటుడు కృష్ణంరాజు కు శస్త్ర చికిత్స
Share |
September 19 2021, 2:06 pm

ప్రముఖ నటుడు కృష్ణంరాజు కు అపోలో ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగిందన్న సమాచారం వచ్చింది. ఆయన సోమవారం నాడు కాలు జారి పడడంతో గాయపడ్డారు. ఆయన తుంటి ఎముక విరిగిందని గుర్తించిన వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేశారు. మూవీ ఆర్టిస్ట్స అసోసియేషన్ కోశాధికారి కూడా అయిన కృష్ణంరాజు అనూహ్యంగా గాయపడడంతో , మా ఎన్నికలు ఆలస్యం అవుతాయా అన్న ప్రశ్న వస్తోంది. కృష్ణంరాజు వయసు రీత్యా పెద్ద వారు కావడంతో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తు ఆయన జారిపడ్డారు. త్వరగా ఆయన కోలుకుంటారని ఆకాంక్షిద్దాం.

tags : krishnamraju

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info