A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బురద చల్లడానికే టిడిపి ఆ కార్యక్రమం..మంత్రి
Share |
September 19 2021, 2:15 pm

రైతుల కోసం తెలుగుదేశం పార్టీ లేదని, రైతులను మోసం చేయడానికే ఆ పార్టీ ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు విమర్శించారు. ప్రభుత్వంపై బురద చల్లడానికి రైతుకోసం తెలుగుదేశం అని టీడీపీ ఒక కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిసిందన్నారు. 14 ఏళ్ల పాలనలో ఏనాడూ రైతులకు మేలు చేయని పాలన సాగించి ఇప్పుడు మొసలి కన్నీరు కారిస్తే రైతులు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌ ఇస్తామంటే చంద్రబాబు ఆ రోజు హేళనగా తీగలపై బట్టలు ఆరవేసుకోవాలని రైతులను కించపరిచారని గుర్తుచేశారు. రైతులకు సంకెళ్లు వేసి రోడ్డుపై నడిపించారని, కాల్పులు జరిపి ప్రాణాలు హరించారని చెప్పారు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి 2014లో ఏం ఒరగబెట్టారో రైతులకు తెలుసన్నారు. కమిటీలు వేసి రూ.87 వేల కోట్లంటూ కేవలం రూ.15 వేల కోట్లు మాఫీచేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. 62 శాతం వ్యవసాయ ఆధారిత జనాభా ఉన్న రాష్ట్రంలో రైతులు నమ్మి ఉంటే టీడీపీకి 23 సీట్లు మాత్రమే ఎందుకొస్తాయో అని ప్రశ్నించుకోవాలన్నారు. రైతుకోసం తెలుగుదేశం కాదు.. రైతు మోసం కోసం తెలుగుదేశం అని సదరు కార్యక్రమం పేరు పెట్టుకోవాలని ఆయన అన్నారు.

tags : kannababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info