A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వేమూరి బెదిరించారన్న గౌరీశంకర్
Share |
September 19 2021, 2:20 pm

ఫైబర్ నెట్ స్కామ్ లో కీలక ఆధారం దొరికినట్లు ఉంది. సిగ్నం డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అదినేత గౌరీశంకర్ , గతంలో చంద్రబాబు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేమూరి హరి ప్రసాద్ పై కొన్ని ఆరోపణలు చేయడం విశేషం. తనను హరిప్రసాద్ బెదిరించారని,
దీంతో డిజిటల్‌ హెడ్‌ ఎండ్‌ పరికరాల సరఫరాలో టెరాసాఫ్ట్‌ కంపెనీకి అనుభవం ఉన్నట్లుగా తప్పుడు సర్టిఫికెట్‌ ఇచ్చానని గౌరీ శంకర్ చెబుతున్నారు. ‘మేం చెప్పినట్లు సర్టిఫికెట్‌ ఇవ్వకపోతే విజయవాడలో ఎలా వ్యాపారం చేస్తావో చూస్తాం’.. అని కూడా వేమూరి హరికృష్ణ తనను తీవ్రస్థాయిలో బెదిరించడంతో భయపడి ఆ విధంగా తాను సర్టిఫికెట్‌ ఇచ్చానని ఆయన వెల్లడించారు. ఫైబర్‌నెట్‌ టెండర్ల కుంభకోణానికి పాల్పడినందుకు వేమూరి హరికృష్ణ ప్రసాద్, టెరాసాఫ్ట్‌ కంపెనీ యాజమాన్యంతోపాటు 19మందిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వేమూరి హరికృష్ణ నాతో ఫోన్లో మాట్లాడుతూ.. వెంటనే సర్టిఫికెట్‌ ఆయనకిచ్చి పంపించమన్నారని గౌరీ శంకర్ ఆరోపించారు. లేకపోతే ఏం జరుగుతుందో చెప్పలేనని తీవ్రస్వరంతో మాట్లాడారు. దాంతో నేను భయపడి టెరాసాఫ్ట్‌ కంపెనీకి ఎక్స్‌పీరియన్స్‌ ఉందని సర్టిఫికెట్‌ ఇచ్చాను. కానీ, దీనిపై ఎప్పటికైనా సరే విచారణ జరుగుతుందని ఊహించా. అందుకే ‘మీరు నాకు చెప్పినట్లుగా టెరాసాఫ్ట్‌కు డిజిటల్‌ ఎండ్‌ పరికరాల సరఫరాలో ఎక్స్‌పీరియన్స్‌ ఉందని సర్టిఫికెట్‌ ఇచ్చాను’.. అని వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు ఓ మెయిల్‌ పంపించాను. ఆ మెయిల్‌ను భద్రపరిచాను. భవిష్యత్‌లో ఎవరైనా అడిగితే వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ బెదిరిస్తేనే ఆ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లుగా ఆధారం ఉండాలి కదా. ఇటీవల సీఐడీ అధికారులు నన్ను విచారించినప్పుడు అన్ని విషయాలు చెప్పాను. అని ఆయన వివరించారు.

tags : vemuri

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info