A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అక్కడ వంగి దండాలు పెట్టిన కెసిఆర్ ..
Share |
September 19 2021, 12:43 pm

కేంద్రంలో ప్రధానమంత్రికి వంగి వంగి దండాలు పెట్టిన కేసీఆర్‌.. రాష్టానికి రాగానే మోదీని, తనను తిట్టడం తప్ప వేరే పని చేయడం లేదని తెలంగాణ బిజెపి అద్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులను రైతులకు కేసీఆర్‌ ఎందుకు అందించడం లేదని, ఫసల్ బీమా ఎందుకు అమలు చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
వరి వేస్తే ఉరి వేసినట్లేనని సీఎం చెప్పాక 5 గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బండి సంజయ్‌ తెలిపారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్నారు. సీఎం మాటలు తట్టుకోలేక తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, సీఎం వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వర్షాలతో తెలంగాణలో పంటలు ఎక్కువ పండుతున్నాయని, ఆ పంటలను కొనడం చేతగాని సీఎం ఆ నెపాన్ని కేంద్రంపై మోపాలని చూస్తున్నాడని ఆరోపించారు. ‘మోదీ ప్రభుత్వం తన కేబినెట్‌లో 27 మంది బీసీలను, 12 మంది ఎస్సీలను, 8 ఎస్టీలను, 12 మంది మహిళలను, 6గురు మైనారిటీలను మంత్రులుగా చేస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న పార్టీ బీజేపీ.అని సంజయ్ అన్నారు.
జీతాలివ్వడానికే డబ్బుల్లేని ప్రభుత్వం దళిత బంధు ఇస్తానని ఆశ చూపుతూ మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. ఎంఐఎం నేతలకు భయపడి నిజాం సమాధి వద్ద మోకరిల్లిన మూర్ఖుడు కేసీఆర్. వాళ్లకు భయపడి, నిజాం ఆస్తుల కోసం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని సంజయ్ ఆరోపించారు.

tags : bandi sanjay

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info