A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి ప్రభుత్వానికి అనూహ్య మద్దతు
Share |
September 19 2021, 1:50 pm

ఎపి ప్రభుత్వానికి అనూహ్య మద్దతు లభించింది. సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సినిమా టిక్కెట్ల విషయంలో ఎపి ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చారు. ఆన్ లైన్ లో టిక్కెట్లు విక్రయించాలన్న ఎపి నిర్ణయం సరైనదేనని, తెలంగాణలో కూడా అమలు చేయాలని ఆయన సూచించారు. నిర్మాతలు ఇష్టం వచ్చిన రేట్లతో దోపిడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనను ప్రస్తావిస్తూ, ముందుగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని కేంద్రం గుర్తించాలని ఆయన అన్నారు. ఈ పోరాటంతో బిజెపికి ఏమి సంబంధం అని ఆయన ప్రశ్నించారు. పెగాసెస్ వ్యవహారంలో న్యాయ వ్యవస్థకు , పరిపాలన వ్యవస్థకు మధ్య ప్రచ్చన్న యుద్దం జరిగే అవకాశం ఏర్పడిందని ఆయన అన్నారు.

tags : narayana, cenema tickets

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info