A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మల్లు ఇంట కాంగ్రెస్ నేతల భేటీ-కొత్త కుంపటా
Share |
September 19 2021, 2:18 pm

తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన పార్టీ నేతల సమావేశం తీరు ఆసక్తికరంగా ఉంది. ప్రధానంగా పిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డితో సరిపడని నేతలు కొందరు భట్టి ఇంటికి హాజరు కావడం విశేషం. ముఖ్యమంత్రి కెసిఆర్ తో జరిగే ధళిత బందు స్కీమ్ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకున్న భట్టి ,దీనిపై సలహాలు కోరేందుకు పలువురు నేతలతో సమావేశం అయ్యారు. వారిలో పిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి లేకపోవడం గమనించదగిన అంశమే. అదే సమయంలో భువనగిరి ఎమ్.పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు ,ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, కాంగ్రెస్ మరో ఎమ్.పి ఉత్తంకుమార్ రెడ్డి, ఇటీవలికాలంలో అసంతృప్తితో ఉన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు ఉన్నారు. మదు యాష్కి, శ్రీధర్ బాబు వంటి మరికొందరు నేతలు ఉన్నా,రేవంత్ అంటే పూర్తిగా సరిపడని కోమటిరెడ్డి సోదరులు ఇక్కడికి రావడం విశేషం.కెసిఆర్ తో జరిగే సమావేశంలో దళితబందుపై లేవనెత్తవలసిన అంశాల గురించి చర్చించామని మల్లు తెలిపారు.

tags : mallu bhatti

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info