A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పెగాసెస్-సుప్రింకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
Share |
September 19 2021, 2:24 pm

పెగాసెస్ స్పైవేర్ వ్యవహారంలో సుప్రింకోర్టు వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. పెగాసస్‌ అంశం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగిందో లేదో స్పష్టం చేస్తే చాలని ధర్మాసనం కేంద్రానికి తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమ కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. పెగాసస్‌ అంశంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు అభ్యంతరం లేదని కేంద్రం ధర్మాసనానికి తెలిపింది. ఈ అంశంపై మరో అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది.కేంద్రం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించిందా లేదా అన్నది అఫిడవిట్‌లో చర్చించే అంశం కాదు అని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన ధర్మాసనం దేశ భద్రత, శాంతి భద్రతల అంశాలలోకి తాము వెళ్లడం లేదని స్పష్టం చేసింది. అదే విధంగా డిఫెన్స్‌ తదితర విషయాలను ప్రస్తావించడం లేదని సుప్రింకోర్టు పేర్కొంది.

tags : supremecourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info