A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రకాశం జిల్లాలో రోడ్డుపై విమానాల లాండింగ్..
Share |
September 19 2021, 12:37 pm

ఎపిలో కూడా రోడ్డు మీద విమానాలు దిగడానికి వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎయిర్ పోర్టులు లేని చోట విమానాల లాండింగ్ కోసం కేంద్రం వీటిని సిద్దం చేస్తోంది. దేశవ్యాప్తంగా 13 చోట్ల వీటిని నిర్మించనుండగా.. మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో రెండుచోట్ల నిర్మిస్తున్నారు. ప్రకాశం జిల్లా కొరిశపాడు–రేణింగవరం వద్ద ఒకటి, సింగరాయకొండలోని కలికివాయ–సింగరాయకొండ అండర్‌ పాస్‌ వరకు మరొకటి ఏర్పాటవుతున్నాయి.
సిమెంట్‌తో నిర్మించే రన్‌వేకు రెండు వైపులా రెండు గేట్లు ఉంటాయి. ఒక ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ టవర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కొరిశపాడు–రేణింగవరం వరకు రూ.23.77 కోట్లతో 5 కి.మీ. పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఒకేసారి 4 విమానాలు ల్యాండ్‌ అయ్యే విధంగా ఎయిర్‌ స్ట్రిప్‌ నిర్మిస్తున్నారు. కలికివాయ–సింగరాయకొండ మధ్య విమానాల అత్యవసర ల్యాండింగ్‌ కోసం రూ.52 కోట్లతో 3.60 కిలోమీటర్ల మేర ఎయిర్‌ స్ట్రిప్‌ నిర్మించనున్నారు. 33 మీటర్ల వెడల్పున కాంక్రీట్‌తో రన్‌వే, రెండువైపులా 12.50 మీటర్ల వెడల్పున గ్రావెల్‌ రోడ్డు, రోడ్డుకు ఇరువైపులా మీటరు వెడల్పున డ్రైనేజీ నిర్మాణం చేపడతారు. రన్‌వేకు 150 మీటర్ల దూరంలో ఏటీసీ భవనం నిర్మిస్తారు.

tags : air strips, roads

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info