A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హుజూరాబాద్ మెజార్టీ 50వేలు-హరీష్
Share |
September 19 2021, 12:40 pm

తెలంగాణ మంత్రి హరీష్ రావు హుజూరాబాద్ ఎన్నికలో తమకు ఏభై వేల మెజార్టీ వస్తుందని చెబుతున్నారు. లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ 50 వేల మెజార్టీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని జమ్మికుంట రోడ్‌లో ఆదివారం మున్నూరుకాపు భవనానికి మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి భూమిపూజ చేసిన అనంతరం వారి ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు మాట్లాడారు. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌ ప్రజలకు చేసిందేమీ లేకనే హుజూరాబాద్‌లో బొట్టు బిళ్లలు, గోడ గడియారాలు, కుట్టుమెషీన్లు, గ్రైండర్లు పంచుతున్నారని, ప్రజలు వాటిని పట్టించుకోకుండా ఇక్కడ ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

tags : harish

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info