A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యాసంగిలో వరి వేయవద్దు- కెసిఆర్
Share |
September 19 2021, 12:58 pm

యాసంగిలో వరి పంట వేయవద్దని ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయం సమీక్ష సందర్భంగా అధికారులు చేసిన సూచనతో ఆయన ఏకీభవించారు. వచ్చే యాసంగి నుంచి రైతులు వరి వేయడమంటే, ఉరి వేసుకోవడమేనని.. ప్రత్యామ్నాయంగా శనగ, వేరుశనగ, పెసర, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదం, కూరగాయల సాగు వంటివి చేపడితే లాభాలు వస్తాయని కొందరు అధికారులు అభిప్రాయపడ్డారు.పారాబాయిల్డ్ రైస్ ను తీసుకోవడానికి కేంద్రం సిద్దపడడం లేదని,అందువల్ల వరి వేయవద్దని ఆయన సూచించారు.రాష్ట్రంలో ప్రస్తుతం 55 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతోందని, కోటీ 40 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్న అంచనాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇప్ప టికే 70 లక్షల టన్నుల ధాన్యం రైస్‌ మిల్లుల్లో, ఇతర ప్రదేశాల్లో నిల్వఉందని.. దీనివల్ల ఈ సారి పూర్తిస్థాయి ధాన్యం కొనుగోళ్లు సాధ్యం కాకపోవచ్చన్నారు. ప్రస్తుత వానాకాలంలో కేంద్రం నిర్దేశించిన మేర 60 లక్షల టన్నులే కొనుగోలు చేయాలని అభిప్రాయపడ్డారు.

tags : kcr, paddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info