A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ టిక్కెట్లూ కెసిఆరే ఇస్తారు
Share |
September 19 2021, 2:00 pm

ఇంతకీ తెలంగాణ రాష్ట్ర సమితి ఎవరికి దగ్గర?కాంగ్రెస్ వారు బిజెపి ఆరోపిస్తుంటే, బిజెపివారు కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తుంటారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను సీఎం కేసీఆరే నడుపుతున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ టికెట్లు కూడా ఆయనే ఇస్తారని నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వ్యాఖ్యానించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చేస్తానంటే అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్‌ బీజేపీకి ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. దీన్నిబట్టే కాంగ్రెస్‌ వెనుక ఎవరున్నారో ప్రజలకు అర్థం అవుతోందని పేర్కొన్నారు.
శుక్రవారం ఇందిరా పార్కు వద్ద బీజేపీ చేపట్టిన ధర్నా సక్సెస్‌ కావొద్దనే ఉద్దేశంతో 48 గంటల ముందు నుంచి బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

tags : kcr, congress, tickets

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info