A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో ఎన్.జి.ఓలకు డి.ఎ. ఉత్తర్వులు
Share |
September 19 2021, 2:07 pm

ఎపిలో ఎన్.జి.ఓలకు డి.ఎ. ఇవ్వబోతున్నారు. దీనికి సంబందించిన ఉత్తర్వులను విడుదల చేయాలని ఆయన తన కార్యాలయ అదికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి ఈ విషయం తెలిపారు. జూలై నుంచి ఇవ్వాల్సిన డీఏకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ ఇంకా విడుదల చేయలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. వీఆర్‌వో ల సమస్యలు విని, వారి సర్వీస్‌ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి.. ఎన్నికల మేనిఫెస్టోలో పె ట్టి, చెప్పినట్టుగానే సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్న తి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారన్నారు. హైదరాబాద్‌ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్‌ కొనసాగింపు జీవో విడుదలకూ సీఎం సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు.

tags : ap, da, ngo

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info