A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ ను ప్రశంసించిన ఆర్.నారాయణ మూర్తి
Share |
September 19 2021, 2:17 pm

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి ప్రశంసించారు. పెద్ద సినిమాలకు ఇష్టానుసారంగా టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశం లేకుండా కొత్త జీవో జారీ చేసిన జగన్‌మోహన్‌రెడ్డికి సెల్యూట్‌ చేస్తున్నానని ఆయన అన్నారు. ఎంతోమంది చిన్న నటీనటుల సినిమాలకు, చిన్న నిర్మాతలకు ఆ జీవో ఆశాకిరణంగా మారిందన్నారు. చిత్రపరిశ్రమ మొత్తం కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిపోవడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. తాను నిర్మించిన రైతన్న చిత్రం ఆగస్టు 15న విడుదలవుతున్నట్లు తెలిపారు.

tags : r narayanamurthy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info