A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోసానికి కరోనా పాజిటివ్
Share |
September 19 2021, 2:21 pm

కరోనా తగ్గుముఖం పట్టిందనుకుంటున్న తరుణంలో మళ్లీ పెరుగుతున్నట్లుగా ఉంది. ప్రముఖ నటుడు , సినీ రచయిత పోసాని కృష్ణ మురళీ కరోనాకు గురైనట్లు వార్త వచ్చింది. ఆయనే ఈ విషయం తెలిపారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అవడంతో గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రిలో చేరారు. తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలను మన్నించమని కోరారు. తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా రెండు పెద్ద సినిమాల షూటింగ్స్ వాయిదా పడే అవకాశం ఉందని, అందుకు తనను మనస్ఫూర్తిగా మన్నించాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకులు, సినీ పరిశ్రమ ఆశీస్సీలతో దేవుడి దయవల్ల త్వరలోనే కోలుకొని మళ్లీ షూటింగ్లకు హాజరవుతానని పోసాని కృష్ణమురళి ఒక ప్రకటనలో తెలిపారు.

పోసాని త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.

tags : posani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info