A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రోడ్లపై శ్రద్ద పెట్టండి- జగన్
Share |
September 19 2021, 1:48 pm

ఎపిలో మున్సిపాలిటీ, నగరాల్లో రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఆర్‌ అండ్‌ బి శాఖతో సమన్వయం చేసుకుని కార్యాచరణ రూపొందించాలని.. పట్టణాలు, నగరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వర్షాకాలం ముగియగానే రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన అన్నారు. కాగా వేస్టే మేనేజ్ మెంట్ పై శ్రద్ద పెట్టాలని ఆయన అన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో ఇప్పటికే ప్లాంట్లు ఉన్నాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురంల్లో కూడా ఇలాంటి ప్రాజెక్టులు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు.

tags : jagan, roads

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info